ప్రకాశం: పొన్నలూరు పోలీస్ స్టేషన్ కొండేపి సీఐ సోమశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని, కేసులను త్వరిత గతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు.