GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లిలోని చిగురు చిల్డ్రన్స్ హోంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం రాత్రి చిన్నారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె పిల్లలకు టపాసులు, స్వీట్లు పంపిణీ చేసి, వారితో కలిసి టపాసులు కాల్చారు. అనంతరం వారికి భోజనం వడ్డించి, ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.