ELR: ద్వారకాతిరుమల శ్రీవారి సాయంకాల అర్చన సమయాన్ని శీతాకాలం ప్రారంభం కారణంగా మార్పు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో NVSN మూర్తి తెలిపారు. ప్రస్తుతం ఈ అర్చన సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు జరుగుతోంది. దీన్ని ఈ నెల 23 నుంచి సాయంత్రం 5 నుంచి రాత్రి 6:30 గంటల వరకు నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఈ అర్చన సమయంలో భక్తులకు స్వామివారి దర్శనం లభించనుందన్నారు.