BHNG: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీపార్క్ ఆవరణలో ఈనెల 25న జరిగే యాదవుల ‘సదర్ సమ్మేళన’ కార్యక్రమానికి హాజరు కావాలని, స్థానిక MLC నెల్లికంటి సత్యం యాదవ్‌ను సోమవారం చౌటుప్పల్ పట్టణ, మండల యాదవ కుల సభ్యులు ఆహ్వానించారు. MLC నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి, శాలువాతో సత్కరించారు. సత్యం యాదవ్ తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.