KRNL: ఓర్వకల్లు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) ప్రిన్సిపాల్ హరిత అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆమె ప్యాంక్రియాటిక్ కార్సినోమా వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. విద్యారంగంలో ఆమె సేవలను సహచరులు అభినందించారు. ప్రిన్సిపాల్ మృతి విద్యా విభాగానికి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.