KMR: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దీపావళి సందర్భంగా HYDలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి తన సతీమణి పుష్ప, కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి, మనవళ్లతో కలిసి ఉల్లాసంగా బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా వారి నివాసంలో పండుగ శోభ వెల్లివిరిసింది.