HNK: ఇటీవల కురిసిన వర్షాలకు వేలేరు మండలంలో తడిసిన ధాన్యాన్ని మంగళవారం ఉదయం బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు కాట్రేవుల రాజుయాదవ్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లనే చేతికందిన పంట నీటిపాలైందని విమర్శించారు.