MBNR: నవాబ్ పేట మండల కేంద్రంలో కుక్కలు గ్రూపులుగా చేరి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బయటికి వెళ్లాలంటేనే కుక్కల బెడద వల్ల వెళ్లలేకపోతున్నామని మండల ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి కుక్కలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వీటి బెడద నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు.