మహబూబ్‌నగర్‌లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ నిన్న తెలిపారు. 3 ప్రైవేట్ సంస్థలలో 370 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, SSC, ఇంటర్, డిగ్రీ ఉండాలన్నారు. అభ్యర్థుల వయసు 18-30 ఉండాలని, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.