BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం చుంచుపల్లి మండలం బాబు క్యాంపు పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను సమీక్షించారు. ఆకస్మికంగా సందర్శించి, తరగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, పాఠశాలలో లభ్యమవుతున్న సౌకర్యాలు పరిశీలించారు.