CTR: నగరి నియోజకవర్గం పుత్తూరు చర్చి కాంపౌండ్ వద్ద గృహ నిర్మాణ లబ్ధిదారుల కోసం ఇసుక అందుబాటులో ఉంచినట్లు ఆ శాఖ ఏఈ సురేంద్ర తెలిపారు. పట్టణంలోని జగనన్న లేఔట్లో 989 గృహాలు మంజూరు అయినట్టు తెలిపారు. వాటిలో ఆప్షన్-3 కింద 189 గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. వాటికి సరఫరా చేసేందుకు ఇసుక డంప్ చేసినట్లు చెప్పారు.