GNTR: పెదకాకానిలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాన్ని ఇవాళ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఆకస్మిక దాడి చేసి 12 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.69,250 నగదు, 11 సెల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నిందితులను అరెస్ట్ చేశారు.