WG: TG రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ డా. సత్య శారద పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ప్రారంభించిన ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని విలువైన సమాచారం అందజేశారని ఆమె అన్నారు. www.telangana.gov.in/telanganarising వెబ్సైట్ను సందర్శించి సలహాలు అందించాలని కోరారు.