GNTR: తెనాలి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల ఇబ్బందులు, నూతన స్టాపింగ్‌లు, ప్రయాణీకుల సమస్యలపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు ‘అమృత్ సంవాద్’ కార్యక్రమం జరగనుంది. రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడు సంపత్ రాయుడు ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అసోసియేషన్ల సభ్యులు పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన కోరారు.