VZM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి బుధవారం మెంటాడ మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు కొండలింగాలవలస నుంచి గజంగుడ్డివలస వరకు రూ. 1.50 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన BT రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్న పార్వతీపురంలో రూ. 60లక్షలతో నిర్మిస్తున్న వన్ స్టాప్ సెంటర్ శంకుస్థాపన చేస్తారు.