BDK: 30 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వర్కర్ల జీతాలను వెంటనే పెంచాలని సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంగోత్ సురేష్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పాల్వంచలో సమ్మె చేస్తున్న కార్మికులకు సోమవారం మద్దతు తెలిపారు.