AP: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన చిన్నారులకు టపాసులు, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సమాజంలో అత్యంత పేదరికంలో గిరిజనులే ఉన్నారని తెలిపారు. గిరిజన కాలనీల దత్తతకు పామాయిల్ ఫ్యాక్టరీల యజమానులు ముందుకొచ్చారని చెప్పారు.