SKLM: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం రణస్థలంలో ఎంపీ కలిశెట్టి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించానని అన్నారు.