కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించకుండా, చోరీలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా పోలీసులు పహారా చేపట్టారు. గ్రామ ప్రజలకు భద్రతా భావన కలిగే విధంగా పోలీసులు గస్తీ విధులు నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో ఎస్ చంటిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.