W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు.