NLG: జిల్లా పోలీసు కార్యాలయంలో రేపు ఉదయం 8.30 గంటలకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించబడనుంది. అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొననున్నారు.