WGL: రాయపర్తి మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి SMAM, RKVY పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం-వ్యవసాయశాఖ సారథ్యంలో రాయితీపై యంత్రాలు, పరికరాలు, పనిముట్లను రైతులకు అందజేయనున్నట్లు AO గుమ్మడి వీరభద్రం బుధవారం తెలిపారు. ఎకరం భూమి, పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న రైతులందరూ అర్హులని, ఆసక్తి కలిగిన మండల రైతులు ఈనెల 28లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.