NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు చేపట్టినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. దీపావళి సందర్భంగా నిన్న రాత్రి ఆయా గ్రామాలలో పేకాట ఆడుతున్న 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.2,46,840 నగదు స్వాధీనం చేసుకుని, 20 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.