కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని సూచించారు. అగ్నిప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.