NLG: దీపావళి సందర్భంగా పేదలు కూడా నూతన వస్త్రాలు ధరించే భాగ్యాన్ని కల్పించారు. కనగల్కు చెందిన గ్రామీణ వైద్యురాలు సామాజిక సేవకులు కంబాల శివ లీల నల్గొండ, క్లాక్ టవర్ సెంటర్ సమీపంలోని హజ్రత్ లతీఫుల్లా ఖాద్రి దర్గా వద్ద సోమవారం అక్కడ ఉన్న పేదలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. దీపావళి రోజున నూతన వస్త్రాలు వారికి అందించడం సంతోషం కలిగిస్తుందన్నారు.