BHNG: CM రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆలేరు MLA బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. పండుగపూట కూడా హరీశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, CM నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఓర్వలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను కూడా రాజకీయాలకు వాడుకోవడం నీచమని విమర్శించారు.