KRNL: ఆదోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సోమవారం సలకలకొండ గ్రామానికి చెందిన ఆవుల సుబ్బలక్ష్మి, ఆవుల సంజీవ దంపతుల కూతురు సుమిత్ర వివాహనికి బంగారు తాళిబొట్టు,వెండి మెట్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు రామలింగేశ్వర యాదవ్, మల్లికార్జున, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.