PDPL: కమాన్ పూర్లో శ్రీపాద రావు విగ్రహం నుంచి పెంచికల్ పేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ పనుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో లారీలు, ఇతర భారీ వాహనాలు జూలపల్లి మీదుగా, రైల్వే ట్రాక్, పోతన కాలనీ మార్గంలో వెళ్లాలని సంబంధిత అధికారులు సూచించారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలన్నారు.