JN: జనగామ జిల్లా కలెక్టర్ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన ఉత్సవాలలో విగ్రహం ఆవిష్కరించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా అధికారులకు ఈ బాధ్యత అప్పగించినట్లు వెల్లడించారు.