MBNR: బాలానగర్ మండలం పలుగు మీది తండాలో బోర్ మోటార్ పాడవడంతో తండావాసులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. దీనిపై తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ స్పందించి, కొత్త మోటార్ కొనుగోలుకు రూ. 25 వేలు విరాళంగా ఇచ్చారు. ఆదివారం తండావాసులు నూతన మోటార్‌ను బిగించగా, తాగునీటి సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేశారు.