NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. గత పది సంవత్సరాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంకిత భావంతో పనిచేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ఆయన తెలిపారు.