PLD: కాటికాపరి ఎఫ్రాన్ హత్య కేసు దర్యాప్తును ఎమ్మెల్యే అరవింద బాబు పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆరోపించారు. నరసరావుపేటలో మాట్లాడుతూ.. వ్యక్తిగత కక్షతో వైసీపీ నేత ఖాదర్ కుటుంబంపై హత్య కేసు రుద్దడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే ఈ కేసును సీబీసీఐడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.