NZB: సాలూర మండల శివారులో మంజీర నదిపై ఉన్న ఎత్తిపోతల పథకం కొన్ని నెలల నిధుల లేమితో మూతపడిన తర్వాత తిరిగి సోమవారం ప్రారంభమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డువంటి సామగ్రిని దొంగిలించడం వల్ల మరమ్మతులు నిలిచిపోయాయి. గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు నూతన కమిటీని ఎన్నుకుని, సొసైటీ ఛైర్మన్ అల్లెజనార్దన్, రైతుల ఆర్థిక సహకారంతో మరమ్మతుల చేశారు.