కర్నూలు వైసీపీ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు సి. క్యాంప్ రైతు బజార్ ప్రాంతంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ కూటమి ప్రభుత్వం 17 వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి వీధి స్థాయిలో అవగాహన కార్యక్రమంతో పాటు ఈ సంతకాల సేకరణ చేపట్టారు.