NLR: వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు ఎస్సై శివ రాకేష్ నిర్వహించారు. ఎస్సై శివ రాకేష్ మాట్లాడుతూ.. మద్యం సేవించి బైక్ నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. వారి డ్రైవింగ్ వల్ల తమతో పాటు ఇతరులు కూడా ఇబ్బందులు పడతారని తెలిపారు.