ATP: నగరంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. ఆ అబ్బాయి ఇంటిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. ఆ అబ్బాయిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలో బాలుడిని కనుక్కున్న పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.