SDPT: కోహెడ మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసింది. గత వారం రోజులుగా చేతికొచ్చిన వరి పంటలను యంత్రాలతో కోస్తూ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మండలంలో కొనుగోలును ప్రారంభించారు.సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.