WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ఉన్న యూనియన్ బ్యాంక్ ATMలు సాంకేతిక లోపంలో మెరాయించాయి. డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళితే ఏటీఎం మిషన్ కీప్యాడ్ పై సంబంధిత వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత, లబ్ధిదారుడు విత్ డ్రా చేసుకునేందుకు అమౌంట్ ఎంట్రీ చేస్తున్న తరుణంలో అమౌంట్ వివరాలు నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఖాతాదారుడు సాంబయ్య ఆరోపించారు. అధికారులు స్పందించాల్సిందిగా కోరారు.