MLG: ములుగు జిల్లా కేంద్రంలోని ఇంచర్ల గ్రామంలో సోమవారం సాయంత్రం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ హాజరై, ముదిరాజ్ జెండాను ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు ఐక్యంగా ఉండి, రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు.