WG: ఆకివీడు మండలం మందపాడు, దుంపగడప గ్రామాల్లో కోడిపందాలు ఆడుతున్న వారిపై పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. మందపాడులో ఐదుగురు, దుంపగడపలో ఇద్దరిపై దాడి చేసి కోడి కత్తులతో పాటు వారి నుంచి రూ. 5,370లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.