ADB: భోరజ్ మండలంలోని గ్రామాల్లో ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. సోమవారం లక్ష్మీపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్లలో లక్ష్మీదేవి ఫొటోను పెట్టి పండ్లు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపి, సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.