MBNR: దీపావళి పండుగ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం చార్మినార్ దగ్గర కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.