BHPL: దీపావళి పండుగను ప్రమాద రహితంగా, ఆనందంగా జరుపుకోవాలని గోరికొత్తపల్లి ఎస్సై శాకాపురం దివ్య హెచ్చరించారు. ఇవాళ SI మాట్లాడుతూ.. టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యం ప్రమాదకరమని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే కాల్చాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ సమీపంలో టపాసులు కాల్చరాదని, అత్యవసర సమయంలో 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.