KDP: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం కడపలో నిర్వహించనున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఉదయం పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.