GDWL: నగరానికి సమీపంలోని జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి కృష్ణానదీ జలాలతో అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చన, ఆకుపూజ, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ రద్దీదృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.