ATP: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలను కాల్చారు. స్వయంగా ఆయన కాకర వత్తులను వెలిగించారు. ఈ ఏడాది పండుగను ఘనంగా జరుపుకున్నట్లు మాధవ్ తెలిపారు. నగరంలో పెద్ద సంఖ్యలో టపాసులు కాల్చడంతో రాత్రి శబ్దాలు భారీగా వినిపించాయి.