అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వారం సంతల ద్వారా రూ. 3.81 లక్షల ఆదాయం వచ్చినట్లు ఏడీఎం యార్డు కార్యదర్శి రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం గొర్రెలు, మేకల సంతలో రూ. 2.27 లక్షలు, ఆదివారం పశువుల సంతలో రూ. 1.54 లక్షలు వచ్చాయని చెప్పారు. దీపావళి సెలవు కారణంగా ఈ మొత్తాన్ని ఇవాళ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు.