JGL: వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్కు చెందిన ఏలేటి జనార్దన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల తెలిపిన ప్రకారం.. జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారి వద్ద రూ. 11 లక్షలు అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీ వేధింపులతో వ్యాపారి ఆయన భూమిని సెల్ డీడ్ చేయించుకున్నాడు.