అన్నమయ్య: మదనపల్లె మండలంలో సోమవారం సాయంత్రం ఇసుక నూతి పల్లెలో ఇంటి ముందు ఆడుకుంటున్న షాకీబ్ (6) అనే బాలుడిని ఓ టెంపో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి కాళ్లు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.