NDL: వెలుగోడు మండలం మాధవరంలో గాలేరు నదిపై నిర్మించిన వారధిపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు భయాందోళన చెందుతున్నారు. డ్రైవింగ్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు దృష్టిసారించి రక్షణ గోడలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.